వేదం భారతీయ జీవన విధానం
ప్రశాంతి నిలయం: వేదం.. భారతీయ జీవన విధానమని, అందుకే మన దేశం వేద భూమిగా కీర్తి పొందిందని సత్యసాయి సెంట్రల ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు అన్నారు. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో శుక్రవారం రెండో ‘గ్లోబల్ వేదిక్’ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన రత్నాకర్ సభికులనుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు సత్యసాయి యజుర్ మందిరం నుంచి వేద పఠనంతో సత్యసాయి సనాతన ధర్మాలను ప్రదర్శిస్తూ మహిళా భక్తులు ర్యాలీగా విచ్చేశారు. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత విభావరి నిర్వహించారు.
ఎగ్జిబిషన్ ప్రారంభం: ‘గ్లోబల్ వేదిక్’ కాన్ఫరెన్స్ సందర్భంగా సత్సంగ్ భవన్‌లో భారతీయ వేద మంత్ర వైభవాన్ని, సత్యసాయి వేద విద్యకు ఇచ్చిన ప్రాధాన్యతను వివరిస్తూ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ హాలులో వేదం ప్రాధాన్యతపై చర్చా ఘోష్టి నిర్వహించారు. సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో డాక్టర్ అనురాధ మహేష్ బృందం సభ్యులు సంగీత కచేరీ నిర్వహించారు.
వేదం భారతీయ జీవన విధానం
వేదం భారతీయ జీవన విధానం


