సందర్భం నేడు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఫౌండేషన్ డే
దేశంలో నాణ్యమైన విద్యను అందించే సంస్థలుగా కేంద్రీయ విద్యాలయాలు గుర్తింపు పొందాయి. తమ పిల్లలను ఈ విద్యా సంస్థల్లో చేర్పించాలని చాలా మంది తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. ఏటా అడ్మిషన్‌లు పొందేందుకు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేస్తుంటారు. అంతటి ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాకు తలమానికంగా ఉన్న నాసిన్‌లో ఏర్పాటైన విద్యాలయలో సోమవారం నిర్వహించనున్నారు.
గోరంట్ల: చక్కటి విద్య, మంచి అలవాట్లు, సమానత్వం వంటి నైతిక విలువలను పెంపొందిస్తూ విద్యార్థులను ఉన్నత స్థానానికి ఎగబాకేలా చేయడంలో కేంద్రీ విద్యాలయ ప్రథమ స్థానంలో నిలుస్తోంది. గోరంట్ల సమీపంలోని పాలసముద్రం వద్ద నాసిన్‌లో ఏర్పాటైన కేంద్రీయ విద్యాలయ... ప్రారంభమైన ఆరు నెలల్లోనే ఉత్తమ విద్యాబోధనతో తన ప్రత్యేకతను చాటుకుంది. ఎలాంటి అభద్రత, అసౌకర్యాల భావన లేకుండా విద్యార్థులు ఒక పద్దతిని పాటిస్తూ ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 1 నుంచి 5వ తరగతివరకూ ఒక్కో తరగతికి 40 మంది చొప్పున 200 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.
మార్నింగ్ అసెంబ్లీతో మొదలై..
ఉదయం 8.40 గంటలకు అసెంబ్లీ నిర్వహణతో కేంద్రీయ విద్యాలయ ప్రారంభమై మధ్యాహ్నం 2.40 గంటలకు ముగుస్తుంది. ప్రత్యేక రోజుల్లో అందుకు అనుగుణంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్తుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా క్రీడలు, యోగా, సంగీతం లాంటి అంశాల్లోనూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. నిరంతర విద్య, క్రీడలలో లీనమవ్వడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతోంది. ఆధునిత సాంకేతికత, నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు, ఒలంపియాడ్ కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. డిజిటల్ ల్యాబ్‌లు, స్మార్ట్ తరగతి గదులు, విద్యార్థి క్లబ్‌లు ఏర్పాటు చేసి మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నారు. పాఠశాలలో నాలుగు హౌస్‌లు ఏర్పాటు చేసి వ్యక్తిత్వ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ పెంపునకు చర్యలు తీసుకున్నారు.
మార్నింగ్ అసెంబ్లీకి హాజరైన విద్యార్థులు
తరగతి గదిలో పాఠాలు వింటూ
జిల్లాకు తలమానికంగా
సెంట్రల్ స్కూల్ ఏర్పాటు
మెరుగైన విద్యతో ఆదర్శంగా నిలుస్తున్న పాఠశాల
విలువలతో కూడిన విద్య
పిల్లల అభ్యసన సామర్థ్యాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. క్రమశిక్షణ, దేశభక్తి, నైతిక విలువలు, సామూహిక భావన వంటివి పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, రాజ్యాంగ విలువలు నేర్పిస్తున్నాం. సృజనాత్మకత పెంపొందేలా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాఠశాల నుంచి విద్యార్థి బయటకు వెళ్లే సమయానికి వారి జీవన గమనానికి పునాదులు బలంగా వేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
– బట్నా కృష్ణారావు, ప్రిన్సిపాల్, కేంద్రీయ విద్యాలయ, పాలసముద్రం
సందర్భం నేడు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఫౌండేషన్ డే
సందర్భం నేడు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఫౌండేషన్ డే
సందర్భం నేడు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఫౌండేషన్ డే


