ఇంధన పొదుపులో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు పురస్కారాలు
గుంతకల్లు: ఇంధన పొదుపులో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు జాతీయస్థాయి పురస్కారాలు లభించాయి. గుంతకల్లులోని డీజిల్ ట్రాక్షన్ శిక్షణ కేంద్రంతోపాటు వసతి గృహం, డివిజన్ పరిధిలోని రాయచూర్ రైల్వేస్టేషన్ విద్యుత్‌ను ఆదా చేసి జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆదివారం జరిగిన బహుతుల పంపిణీ కార్యక్రమంలో ‘2025 నేషనల్ ఎనర్జీ కన్వర్షన్’ అవార్డును డీజిల్ ట్రాక్షన్ శిక్షణ కేంద్రం, వసతి గృహం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ్ రాష్ట్రపతి దౌప్రదిముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. రాయచూర్ రైల్వేస్టేషన్ ‘ఉత్తమ ఇంధన పొదుపు రైల్వేస్టేషన్’ అవార్డును కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ చేతుల మీదుగా డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా, సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ శ్రీనిబాష్ సంయుక్తంగా అందుకున్నారు. షీల్డ్‌తోపాటు రూ.10 లక్షల నగదు పురస్కారం అందజేసినట్లు వారు తెలిపారు.
ఇంధన పొదుపులో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు పురస్కారాలు


