ర్యాలీని జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

ర్యాలీని జయప్రదం చేయండి

Dec 15 2025 10:21 AM | Updated on Dec 15 2025 10:21 AM

ర్యాల

ర్యాలీని జయప్రదం చేయండి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌

పుట్టపర్తి టౌన్‌/పెనుకొండ రూరల్‌: జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులతో సోమవారం నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పిలుపుమేరకు మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆ ప్రతులను ఇప్పటికే పుట్టపర్తిలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేర్చామని తెలిపారు. సంతకాల ప్రతులతో సోమవారం ఉదయం 10 గంటలకు పుట్టపర్తిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద నుంచి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి మీదుగా మామిళ్లకుంట క్రాస్‌ వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్ని నియోజవర్గాల పార్టీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా పరిశీలకులు రమేష్‌రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ర్యాలీని విజయవంతం చేయాలని వారు కోరారు.

నేడు డయల్‌ యువర్‌ సీఎండీ

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్‌ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు నేరుగా 89777 16661 నంబర్‌కు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు ఫోన్‌ చేయాలని సూచించారు.

నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రశాంతి నిలయం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్‌ఎస్‌ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను ఈ సమర్పించుకోవచ్చన్నారు.

ఎస్పీ కార్యాలయంలో...

పుట్టపర్తి టౌన్‌: పుట్టపర్తి పోలీస్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల రూపంలో తెలియజేవచ్చని సూచించారు. అర్జీదారులు ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు.

అరటి తోటలో కొండచిలువ

పుట్లూరు: కుమ్మనమల సమీపంలోని అరటి తోటలో ఆదివారం కొండచిలువ కలకలం రేపింది. అంకన్న అనే రైతు తన అరటి తోట వద్దకు వెళ్లిన సమయంలో ఎనిమిది అడుగులకు పైగా ఉన్న కొండ చిలువ ఏదో జంతువును మింగేసి కదలలేని స్థితిలో కనిపించింది. వెంటనే ఆయన తోటి రైతులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. కాసేపటికి అక్కడకు చేరుకున్న రైతులు అరటి తోటల్లో ఇలాంటి కొండచిలువ ఉంటే ప్రమాదమని భావించి అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. అటవీ శాఖ అధికారులు వచ్చి కొండ చిలువను పట్టుకుని సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలేశారు.

ముదిగుబ్బ రైల్వేగేటు మూసివేత

ముదిగుబ్బ: మండల కేంద్రం సమీపంలోని రైల్వే గేటును మరమ్మతుల కారణంగా ఈనెల 16, 17 తేదీల్లో మూసివేస్తున్నట్లు ఎస్‌ఎస్‌ఈ శివం మాతూర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కదిరికి వెళ్లే వాహనదారులు బైపాస్‌ మీదుగా, పుట్టపర్తికి వెళ్లే వారు పాతూరు గేటు నుంచి వెళ్లాలని సూచించారు.

ర్యాలీని జయప్రదం చేయండి1
1/2

ర్యాలీని జయప్రదం చేయండి

ర్యాలీని జయప్రదం చేయండి2
2/2

ర్యాలీని జయప్రదం చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement