ఊరూరా ‘బెల్ట్’ దందా
పుట్టపర్తి టౌన్: జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. జిల్లా వ్యాప్తంగా 87 మద్యం దుకాణలేనని ప్రభుత్వం చెబుతున్నా ఊరూరా బెల్ట్ షాపులు తెరిచారు. మారుమూల గ్రామమైనా సరే ఏ సమయంలోనైనా సరే మద్యం మాత్రం అందుబాటులో ఉంటోంది.
నిబంధనలకు పాతర
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి పరిధిలో 8 కిలోమీటర్ల దూరంలో మద్యం, మాంసం దుకాణాలు ఏర్పాటు చేయకూడదు. అలాగే విక్రయాలు చేపట్టకూడదు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణం నడిఒడ్డున హనుమాన్ సర్కిల్‌తో పాటు పెద్ద బజార్, గుట్టప్రాంతంలో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సత్యసాయి సూపర్ ఆస్పత్రి వద్ద ఏకంగా బెల్టు షాపు ఏర్పాటు చేశారు. తాగి ఊగేందుకు బెంచ్‌లు కూడా ఉంచారు. వివిధ వార్డుల్లోనూ బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. దీంతో ప్రశాంతత కోసం పుట్టపర్తికి వస్తున్న విదేశీయులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధిక ధరలకు విక్రయాలు
జిల్లా వ్యాప్తంగా 8 ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 87 దుకాణాలు ఉన్నాయి. ఇందులో 80 దుకాణాలు అధికార పార్టీకి చెందిన వారివే. మద్యం దుకాణాలతో పాటు బెల్టు షాపుల్లోనూ బాటిల్‌పై రూ. 20 నుంచి రూ.30 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
800 వరకు బెల్ట్ షాపులు
జిల్లాలో 87 మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రతి మద్యం షాపు పరిధిలో 8 నుంచి 10 బెల్టు షాపులను అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. బెల్టు షాపు నిర్వాహకులు రూ.లక్ష డిపాజిట్ చెల్లించి వైన్ షాపుల నుంచి మద్యం తీసుకెళ్లేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే తమకు అనుకూలమైన చిల్లర దుకాణాల్లో కూడా మద్యం అమ్ముతున్నారని అంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా 87 మద్యం
దుకాణాలకే అనుమతులు
ఒక్కో షాపు పరిధిలో
10 దాకా బెల్ట్ షాపులు
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలోనూ ఏజోరుగా మద్యం అమ్మకాలు
అనుమతులు లేవు
రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఉన్న దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయాలు జరపాలి. బెల్టు షాపులకు అనుమతులు లేవు. ఎక్కడైనా బెల్టు షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవు. జనావాసాల మధ్య మద్యం అమ్మకాలు జరిపితే స్థానికులు సమాచారం ఇస్తే చర్యలు చేపడతాము.
– గోవిందనాయక్,
ఎకై ్సజ్ సూపరింటెండెంట్, పుట్టపర్తి
బెల్ట్ షాపుల నిర్వహణపై ఇరు వర్గాల ఘర్షణ
తలుపుల : మండలంలోని కదిరి –పులివెందుల రోడ్డులో బి.కొత్తపల్లి వద్ద బెల్ట్ షాపుల నిర్వహణపై హోటల్ నిర్వాహకులు ఆదివారం రాత్రి ఘర్షణ పడ్డారు. ఘర్షణలో గాయపడిన బయపురెడ్డి, శీలమ్మను 108 అంబులెన్స్‌లో కదిరికి తరలించారు.
ఊరూరా ‘బెల్ట్’ దందా


