సమస్య తీరదు
పనులు పూర్తి కావు..
సోమందేపల్లి: జాతీయ రహదారి 44కు అనుబంధంగా హిందూపురం మీదుగా బెంగళూరుకు వెళ్లే మార్గంలో సోమందేపల్లి మండలం చాకర్లపల్లి రైల్వే గేట్ వద్ద చేపట్టిన ఆర్‌ఓబీ పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా తరచూ రైల్వే గేటు పడుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి రోగులను తరలించే అంబులెన్స్‌లు సైతం రైల్వే గేట్ పడినప్పుడు అర గంటకు పైగా ఆపేయాల్సి వస్తోంది. దీంతో కొన్ని సందర్భాల్లో రోగి పరిస్థితి విషమించి ఆస్పత్రికి చేరేలోపు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ఇక పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల పరిస్థితి వర్ణణాతీతం.
ఏడాదిన్నరగా ముందుకు సాగని పనులు..
2019 ఎన్నికల సమయంలో రూ.5 కోట్లతో చాకర్లపర్లి రైల్వే గేట్ వద్ద ఆర్‌ఓబీ నిర్మాణానికి రైల్వే అధికారులు శ్రీకారం చుట్టారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సహకారంతో కొంత మేర పనులు చకచకా సాగాయి. ఏడాదిన్నరగా పనులు ముందుకు సాగడం లేదు. దీనిపై రైల్వే అధికారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించకపోవడంతో రోజురోజుకూ ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. స్ధానికంగా పార్లమెంట్ సభ్యుడు బి.కె పార్ధసారథి, మంత్రి సవిత ఉన్నా... పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌తో పాటు గూడ్స్ రైళ్లు దాదాపు 50కు పైగా ఈ గేట్ మీదుగా సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో రైలు వస్తున్న ప్రతిసారీ 15 నిమిషాల నుంచి అరగంటకు పైగా గేట్ వేసేస్తున్నారు. ఇలాంటి సమయంలో అత్యవసర పనిపై బయలుదేరిన వారు రైల్వే గేట్‌మెన్‌తో వాగ్వాదానికి దిగుతుంటారు. ఇటీవల గేటు పడడంతో మంత్రి సవిత కాన్వాయ్ చిక్కుకుపోయింది
పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన రహదారుల విస్తరణలో భాగంగా రైల్వే లైన్ వద్ద చేపట్టిన రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు ఆరేళ్లుగా అసంపూర్తి పనులతో చాకర్లపల్లి రైల్వే గేట్ వద్ద ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నారు.
నత్తనడకన చాకర్లపల్లి
ఆర్‌ఓబీ నిర్మాణం
గేట్ పడితే గంటల కొద్దీ
ట్రాఫిక్‌కు అంతరాయం
సమస్య పరిష్కారించాలి
సుదీర్ఘకాలంగా రైల్వే గేటు సమస్య తీరడం లేదు. రైల్వే అధికారులు స్పందించి ఆర్‌ఓబీ పనులు వెంటనే పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలి. గంటల తరబడి గేటు పడుతుండడంతో అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
– గంగమ్మ, ఎంపీపీ, సోమందేపల్లి
పాలకులు చొరవ తీసుకోవాలి
ఆరేళ్లుగా నత్తనడకన రైల్వే ఆర్‌ఓబీ పనులు సాగుతున్నాయి. రోజూ గేటు పడితే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి చొరవ తీసుకుని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
– జావీద్, న్యాయవాది, సోమందేపల్లి
సమస్య తీరదు
సమస్య తీరదు
సమస్య తీరదు


