ఇంధన పొదుపు సామాజిక బాధ్యత
పుట్టపర్తి టౌన్: భవిష్యత్ తరాలకు సుస్థిరమైన జీవిన విధానం అందించాలంటే ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపును నిత్య జీవితంలో ఓ భాగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో సోమవారం చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు. ఇంధన పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. అవసరం మేరకే విద్యుత్‌ను వాడాలన్నారు.సోలార్ గృహోపకరణాలతో ఈ సమస్యను అధిగమించవచ్చునన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్సీడీసీఎస్ ఎస్‌ఈ సంపత్‌కుమార్, డీఈ శివరాం, కమిషనర్ క్రాంతికుమార్, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్


