రైతులను బెంబేలెత్తిస్తున్న విషసర్పాలు
పుట్టపర్తి అర్బన్: పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ విషసర్పాలు సంచరిస్తుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వేరుశనగ, మొక్కజొన్న, రాగి తదితర పంటల్లో పాముల బెడద ఎక్కువగా ఉన్నట్లుగా రైతులు వాపోతున్నారు. పొలాల్లో సంచరిస్తున్న ఎలుకల కోసం వచ్చే పాములు బీడు భూముల్లో పొదల మాటున దాగుంటున్నాయని, ఆదమరచి అటుగా వెళితే కాటేస్తున్నాయని అంటున్నారు. పాముకాటుకు గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించడం చాలా ఇబ్బంది ఉంటోందని వాపోతున్నారు. ముఖ్యంగా కంటికి చిన్నగా కనిపించే జెర్రీ సైతం కాటేస్తే శరీరం మొత్తం ఎర్రబారి మంటలెక్కి పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేజీబీవీ విద్యార్థినులకు
కలెక్టర్ ప్రశంస
పరిగి/తాడిమర్రి/ప్రశాంతి నిలయం: జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై న పరిగి, తాడిమర్రి, చెన్నేకొత్తపల్లిలోని కేజీబీవీ విద్యార్థినులను సోమవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ అభినందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో పరిగి కేజీబీవీ విద్యార్థినులు ఆర్. మానస (కబడ్డీ), లాస్య ప్రియ(రగ్బీ), హర్దిని (హ్యాండ్‌బాల్), పవిత్ర (హ్యాండ్‌బాల్), ఎస్‌ఓ రమాదేవి, పీఈటీ అశ్విని, తాడిమర్రి కేజీబీవీ విద్యార్థినులు ఎస్.స్వాతి (బేస్‌బాల్), ఎస్‌ఓ వాణిశ్రీ, తదితరులు ఉన్నారు.
పరిష్కార వేదికకు
80 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 80 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. అర్జీలు పునారావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ,లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, సీఐ ఇస్మాయిలపాల్గొన్నారు.
ధర్మవరం మున్సిపల్
కమిషనర్‌గా వెంకటరమణయ్య
కర్నూలు(అగ్రికల్చర్): ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా డిప్యుటేషన్‌పై కర్నూలు జిల్లా డ్వామా పీడీ పి.వెంకటరమణయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖలో డివిజినల్ డెవలప్‌మెంటు ఆఫీసర్‌గా ఉన్న ఆయన గత ఏడాది నవంబరు 20 నుంచి డ్వామా పీడీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల శిక్షణ కోసం విశాఖపట్నం వెళ్లారు.
జనవరిలో మిల్లెట్ మేళా
అనంతపురం అర్బన్: ఉమ్మడి జిల్లాకు చెందిన స్వచ్ఛంద సంస్థల ఫోరం ఆధ్వర్యంలో జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అనంతపురంలో మిల్లెట్ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కలెక్టర్ ఓ.ఆనంద్ విడుదల చేసి, మాట్లాడారు. సహజ వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, మార్కెటింగ్, స్థానిక వినియోగంపై దృష్టి సారించి మిల్లెట్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎకాలజీ సెంటర్ రూపొందించిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లావ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవీమల్లారెడ్డి, టింబక్టు ప్రతినిధి శ్రీకాంత్, రెడ్స్ డైరెక్టర్ భానూజా, తదితరులు పాల్గొన్నారు.
రైతులను బెంబేలెత్తిస్తున్న విషసర్పాలు
రైతులను బెంబేలెత్తిస్తున్న విషసర్పాలు
రైతులను బెంబేలెత్తిస్తున్న విషసర్పాలు
రైతులను బెంబేలెత్తిస్తున్న విషసర్పాలు
రైతులను బెంబేలెత్తిస్తున్న విషసర్పాలు


