రమణీయం.. బ్రహ్మ రథోత్సవం
లేపాక్షి: మండలంలోని కంచిసముద్రం గ్రామంలో గోందావళి సద్గురు బ్రహ్మ చైతన్య స్వామి 112వ ఆరాధన మహోత్సవంలో భాగంగా శనివారం సీతారాముల బ్రహ్మ రథోత్సవం ఘనంగా సాగింది. స్వామి వారికి విశేష పూజలు చేసిన అనంతరం బ్రహ్మచైతన్య ఆలయంలో ఏకాదశ వార రుద్రాభిషేకం, గోమాత పూజ, సహస్రనామ పూజ, తారకమంత్రం జపం, నవగ్రహ జపం, సూర్యాప్రార్థన, అఖండ రామనామ సంకీర్తన, సుందరకాండ పారాయణం నిర్వహించారు. సీతారాముల విగ్రహాలను బహ్మరథం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించారు. మహా మంగళ హారతి అనంతరం బ్రహ్మ రథోత్సవం ప్రారంభించారు. ఉత్సవం సందర్భంగా జై శ్రీరాం, జైజై శ్రీరాం నినాదాలు మార్మోగాయి. వైఎస్సార్‌సీపీ హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపికా ఉత్సవంలో పాల్గొని సీతారాములకు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ సయ్యద్‌నిస్సార్, సర్పంచ్ గంగరాజమ్మ, ఎంపీటీసీ సభ్యుడు ఆదినారాయణ, నాయకులు ఆనంద్, వెంకటేశ్, గోపాలప్ప, నాగరాజు, నరేష్, మైలారప్ప, చంద్రశేఖర్, గోపి, సజ్జప్ప, బాలు, నందీష్, బాలక్రిష్ణ, లక్ష్మినారాయణ, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.
రమణీయం.. బ్రహ్మ రథోత్సవం


