చిరుత దాడిలో పొట్టేళ్ల మృతి
పెనుకొండ: పట్టణంలోని చెరువు రోడ్డుకు చెందిన వడ్డే వెంకటేష్, వడ్డే శ్రీనివాసులుకు చెందిన మూడు పొట్టేళ్లపై చిరుత దాడి చేసి, చంపేసింది. వివరాలు.. వడ్డే వెంకటేష్, వడ్డే శ్రీనివాసులు ఇంటి సమీపంలో పొట్టేళ్లను కట్టేశారు. శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలోని కొండ నుంచి వచ్చిన చిరుత పొట్టేళ్లపై దాడి చేసింది. మూడు పొట్టేళ్లను చంపేసింది. ఉదయం ఈ విషయాన్ని బాధితులు గమనించి, అటవీశాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు డీఆర్‌ఓ చాంప్లానాయక్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాహుల్, పశువైద్యాధికారి జాహ్నవి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.బాధితులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తామని అటవీశాఖ రేంజర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.


