ప్రశాంతంగా నవోదయ ప్రవేశపరీక్ష
లేపాక్షి/హిందూపురం: లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026 విద్యాసంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అందులో మొత్తం 6,634 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,899 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. హిందూపురంలోని 1,242 మందికి ఐదు కేంద్రాలు కేటాయించగా, అందులో 584 మంది హాజరయ్యారు. పట్టణంలోని పరీక్ష కేంద్రాలను పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ ఆకిస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాలను డీటీ మైనుద్దీన్, ఎంఈఓలు గంగప్ప, ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.


