జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ కేసు నమోదు

Dec 14 2025 12:11 PM | Updated on Dec 14 2025 12:11 PM

జిల్ల

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ కేసు నమోదు

ఎన్‌పికుంట: మండలంలోని గంగినాయుని పల్లికి చెందిన ఓ యువకుడికి స్క్రబ్‌ టైఫస్‌ బారి న పడినట్లు మండల వైద్యాధికారి ఆనంద్‌వర్ధన్‌ తెలియజేశారు. యువకుడికి మూడు రోజులుగా జ్వరం వస్తుండటంతో అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో డెంగీ, మలేరియా, రక్త పరీక్షలు చేయించాడు. జ్వరం తగ్గకపోవడంతో బెంగళూరు సెయింట్‌ జాన్స్‌ ఆసుపత్రిలో చేరగా, ఎలిశా పరీక్షలు చేయడంతో స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శనివారం ఇంటికి వచ్చిన యువ కుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ నాగలక్ష్మి, ఆరోగ్య కార్యకర్త రమేష్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వైరస్‌పై అవగాహన కల్పించండి

ఓడీచెరువు (అమడగూరు):స్క్రబ్‌ టైఫస్‌ వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఫైరోజాబేగం ఆదేశించారు. శనివారం అమడగూరు పీహెచ్‌సీని డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. ఫార్మసీ, ల్యాబ్‌, కంప్యూటర్‌ గది, వార్డు, కాన్పు గదులను పరిశీలించా రు. పల్స్‌పోలియో కార్యక్రమంపై ఆరాతీశారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వందశాతం ఫలితాలు సాధించాలి

కదిరి అర్బన్‌: వందరోజుల ప్రణాళికను ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి కిష్టప్ప ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి వంద రోజుల కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా వంద రోజుల్లో చదవాల్సిన విధానాన్ని డీఈఓ విద్యార్థులకు తెలియజేశారు. పదో తరగతిలో మంచి మార్కులే లక్ష్యంగా సాధన చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులు మంచి మార్కులు సాధింంచేందుకు కృషి చేయాలని సూచించారు. అంతకు మునుపు ఆయన కదిరి పట్టణంలో నిర్వహిస్తున్న నవోదయ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓబుల్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు వెంకటాచలం ఉన్నారు.

ఓం నమో నరసింహా..

కదిరి టౌన్‌: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. కదిరి పరిసర ప్రాంతల నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా కర్ణాటక, కడప, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హజరై ఖాద్రీశుడిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలు ఓం నమో నారసింహా.. ఓం నమో నారసింహా .. నామస్మరణతో మార్మోగాయి.

మహిళపై పంది దాడి

ధర్మవరంఅర్బన్‌: పట్టణంలోని సత్య సాయినగర్‌కు చెందిన రజియా అనే మ హిళ శనివారం ఇంటి బయట ఉండగా అకస్మాత్తుగా పంది దాడి చేసింది. ఆమె చేతి రెండు వేళ్లను కొరికింది. ఆమె గట్టిగా కేక లు వేయడంతో స్థానికులు పందిని తరిమేశారు. చికిత్స నిమిత్తం ఆమెను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేశారు. పట్టణంలో పందులు, కుక్కల బెడద అధికమైందని ప్రజలు అంటున్నారు.

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌  కేసు నమోదు1
1/3

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ కేసు నమోదు

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌  కేసు నమోదు2
2/3

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ కేసు నమోదు

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌  కేసు నమోదు3
3/3

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement