మధ్యాహ్న భోజనంలో పురుగులు!
గుడిబండ: రోజూ కళాశాలలో తినే మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడం...అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్థానిక జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతరం విద్యార్థులంతా ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ శ్రీధర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.... నాలుగైదు నెలలుగా కళాశాలలో వడ్డించే మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటోందని, రోజూ భోజనంలో పురుగులు వస్తున్నాయని వాపోయారు. దీంతో చాలా మంది భోజనం తినలేక వస్తులుంటున్నారన్నారు. వారానికి ఒకసారి కూరగాయలు తీసుకువస్తారని, వారమంతా వాటితోనే కూరలు వండుతున్నారన్నారు. అలాగే నాసిరకమైన బియ్యంతో భోజనం వండుతుండగా..పురుగులు వస్తున్నాయన్నారు. ఆకలితో కొందరు విద్యార్థులు అదే భోజనం చేసి రోగాల బారిన పడ్డారన్నారు. తమ బాధను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని, అందువల్లే ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు విద్యార్థుల కష్టాలను గుర్తించి నాణ్యతతో కూడిన భోజనం వడ్డించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆందోళనకు దిగిన గుడిబండ
జూనియర్ కళాశాల విద్యార్థులు
పురుగుల అన్నం తినలేక
పస్తులుంటున్నామని ఆవేదన
మధ్యాహ్న భోజనంలో పురుగులు!


