17న పరిష్కార వేదిక రద్దు
ప్రశాంతి నిలయం: సత్యసాయి శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 17వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సత్యసాయి జయంతి ఉత్సవాల నిర్వహణలో అధికారులంతా నిమగ్నమయ్యారని, అందువల్ల ‘పరిష్కార వేదిక’ను రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ,ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.
పుట్టపర్తిలో
భద్రత కట్టుదిట్టం
● 250 మంది సిబ్బందితో
ఎస్పీ కార్డెన్‌సెర్చ్
పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా శతజయంతి వేడుకల నేపథ్యంలో ప్రశాంతి నిలయంతో పాటు పట్టణంలో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం పుట్టపర్తిలోని సాయినగర్, చిత్రావతి రోడ్డు, ప్రశాంతి గ్రాం, కర్ణాటకనాగేపల్లి పరిసర ప్రాంతాల్లో 250 మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్‌లు నిర్వహించారు. అలాగే ఇళ్లల్లో సోదాలు చేసి రికార్డులు లేని 50 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ముగిసేంత వరకు సెర్చ్‌లు కొనసాగుతాయని, రానున్న రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కూడా తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామన్నారు. లాడ్జీల నిర్వాహకులు గదులు అద్దెకు ఇచ్చేముందు పూర్తి వివరాలు సేకరించాలన్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
పర్వతారోహణలో
కుసుమ అరుదైన ఘనత
శింగనమల: పర్వతారోహణలో జిల్లాకు చెందిన కుసుమ అరుదైన ఘనత సాధించింది. నార్పల మండలం దుగుమర్రి గ్రామానికి చెందిన రైతు పెద్దన్న, నారాయణమ్మ దంపతుల కుమార్తె కె.కుసుమ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని గీత అకాడమీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఫస్టియర్‌లోనే ఆమెకు పర్వతారోహణపై ఆసక్తి ఏర్పడింది. భువనగిరిలోని రాక్ క్లెయిన్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్న ధ్యేయంతో పర్వతాలను ఎక్కడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీన హైదరాబాద్ నుంచి ఆఫ్రికాకు బయల్దేరింది. ఆఫ్రికాలో ఖండంలోనే అత్యంత ఎత్తయిన, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీస్టాండింగ్ పర్వతంగా పేరుగాంచిన కిలిమంజారో మౌంటెన్‌ను ఈ నెల 12న అధిరోహించింది. శిఖరంపై జాతీయ జెండాతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను ఎగురవేసింది.
17న పరిష్కార వేదిక రద్దు


