కూటమి సర్కారు నియంతృత్వ పోకడల కారణంగా.. జిల్లాలో టీడీపీ
అధికార పార్టీ ఒత్తిళ్లు సహజం. కానీ అన్యాయానికి గురైన నిరుపేదలు పోలీసు స్టేషన్‌కు వెళితే ఎంతో కొంత న్యాయం జరగాలి. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. పోలీసులపై నమ్మకం పోతోంది. అన్యాయానికి గురైన వారు ఆత్మహత్యలు చేసుకునేందుకు కూడా వెనుకాడటం లేదంటే టీడీపీ నేతల ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి స్వస్తి పలకాలి. ఇప్పటికైనా పోలీసుల్లో మార్పు రావాలి.
– సాకే హరి, ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
కుటుంబ సమస్యల్లో రాజకీయ నేతల జోక్యం సరికాదు. చాలా ప్రాంతాల్లో కుటుంబ సమస్యలతోనే పోలీసు స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి సమయంలో వారికి సర్దిచెప్పి కలిపే విధానాన్ని అవలంభించకుండా పంచాయితీ పేరుతో బెదిరింపులు, దౌర్జన్యం చేయడం సరికాదు. కొన్ని సందర్భాలలో ఈ తరహా విధానం వికటించి బాధితులు ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదముంది. ఇలాంటివన్నీ ప్రేరేపిత హత్యలుగానే పరిగణించబడుతాయి.
– హనుమంతరెడ్డి, వైఎస్సార్‌సీపీ
లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు
కళ్యాణదుర్గం: కుటుంబంలో నెలకొన్న చిన్నపాటి గొడవలు... మనస్పర్థలు టీడీపీ నేతలకు ఆదాయ వనరులుగా మారాయి. కుటుంబ సమస్యల్లో జోక్యం చేసుకుంటూ దుప్పటి పంచాయితీల పేరుతో దందాకు తెరలేపారు. ఓ వైపు వారినుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని ఏకపక్ష నిర్ణయాలతో బలవన్మరణాలకు కారకులవుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులపై ఒత్తిళ్లు తీసుకెళ్లి ఫిర్యాదులను మార్చేసి పాపం మూటగట్టుకుంటున్నారు. టీడీపీ నేతలు, పోలీసులతో తమకు న్యాయం జరగదంటూ పలువురు సెల్ఫీ వీడియోలలో తమ బాధను వెళ్లగక్కుతూ ఆత్మహత్యలకు పాల్పడడమే ఇందుకు నిదర్శనం. ఈ నాలుగు నెలల వ్యవధిలోనే మూడు ఘటనలు కళ్యాణదుర్గంలో ఉలిక్కి పడేలా చేశాయి. ఇక వెలుగు చూడని ఆత్మహత్యలు ఎన్నో ఉన్నాయి.
మచ్చుకు కొన్ని..
● ఈ ఏడాది ఆగస్టు 15న కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన నిండు గర్భిణి శ్రావణి (22) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్త మామల వేధింపులు తాళలేక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా ఆమెకు న్యాయం జరగలేదు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఏకంగా ఫిర్యాదునే మార్చేశారంటూ తన ఫోన్‌లో ఆడియో రికార్డ్ చేసి ఆమె తనువు చాలించింది. అదనపు కట్నం కోసం తన భర్త శ్రీనివాసులు వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలంటూ కళ్యాణదుర్గం పట్టణ పోలీసులను ఆశ్రయిస్తే స్థానిక టీడీపీ నేతలు వైపీ రమేష్ (మాజీ మున్సిపల్ చైర్మన్), మాజీ వైస్ చైర్మన్ శర్మస్‌వలి (ఇద్దరూ టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు అత్యంత సన్నిహితులు) జోక్యం చేసుకోవడంతో ఫిర్యాదును పోలీసులు మరో రకంగా మార్చి తనను బలి పశువును చేశారంటూ ఆడియోలో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక తనకు న్యాయం జరగదని టీడీపీ వారి వల్లే తాను చనిపోతున్నానంటూ తెలిపి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
● గత నెల 27న కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన యువకుడు కృష్ణగౌడ్ తాను చనిపోతున్నానంటూ పురుగుల మందు సేవిస్తూ తీసిన సెల్ఫీవీడియోను స్నేహితులకు పంపాడు. దాదాపు రూ.14.50 లక్షలను ఎంతో నమ్మకంతో జయమ్మ కుమారులకు అప్పుగా ఇచ్చానని పేర్కొన్నాడు. ఇచ్చిన డబ్బును అడిగితే తనను అవమాన పరిచారని విలపించాడు. టీడీపీ యువ నాయకుడు కొండాపురం అనిల్ చౌదరి, మరి కొందరు దుప్పటి పంచాయితీ చేసి, తనపైనే దౌర్జన్యం చేశారని ఆరోపించాడు. పది రోజుల క్రితం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వాపోయాడు. ఈ అవమానం భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపి పురుగుల మందు తాగాడు. అప్రమత్తమైన స్నేహితులు, బంధువులు వెంటనే కృష్ణగౌడ్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది.
● ఈ నెల 2న శెట్టూరు మండలం మాలేపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త తలారి శివ ఆత్మహత్యాయత్నం చేశాడు. తనను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పట్టించుకోవడం లేదని, గత సర్పంచ్ ఎన్నికల్లో రూ.15 లక్షలు ఖర్చు పెట్టినా తనకు టీడీపీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, దీంతో తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సెల్ఫీవీడియోలో తెలిపి కళ్యాణదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ భవనంలో పురుగుల మందు తాగాడు. ఏ కార్యకర్త తనలా అన్యాయం కాకూడదని వీడియోలో పేర్కొనడం గమనార్హం. ఈ అంశంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సకాలంలో శివను ఆస్పత్రికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది.
ఫిర్యాదులు తారుమారు చేసి..
న్యాయం కోసం తమను ఆశ్రయించిన బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు కాస్త టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. బాధితుల ఫిర్యాదులను తారుమారు చేసి ఎదురు దబాయింపులకు దిగుతున్నారు. దీంతో తమకు న్యాయం జరగడం లేదంటూ బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే తాము ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నట్లు స్పష్టంగా సెల్ఫీవీడియోలలో చెప్పడమే ఇందుకు నిదర్శనం.
కుటుంబ సమస్యల్లో టీడీపీ నేతల జోక్యం
ఊపందుకున్న దుప్పటి పంచాయితీల దందా
పోలీసులను అడ్డుపెట్టుకుని
బాధితుల ఫిర్యాదులను
తారుమారు చేస్తున్న వైనం
సెల్ఫీ వీడియోతో బలవన్మరణాలకు పాల్పడుతున్న బాధితులు
కూటమి సర్కారు నియంతృత్వ పోకడల కారణంగా.. జిల్లాలో టీడీపీ
కూటమి సర్కారు నియంతృత్వ పోకడల కారణంగా.. జిల్లాలో టీడీపీ


