
తాటిమానుగుంతలో వైద్య శిబిరం
ఎన్‌పీకుంట: మండలంలోని తాటిమానుగుంత గ్రామంలో మండల వైద్యాధికారి డాక్టర్ బాలాజీనాయక్ ఆధ్వర్యంలో గురువారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ‘వణికిస్తున్న జ్వరాలు’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం వెలువడిన కథనంపై వైద్యాధికారులు స్పందించి గ్రామంలో ఇంటింటా సర్వే చేపట్టి జ్వర పీడితులను గుర్తించారు. అనంతరం అవసరమైన వారికి మందులు అందజేశారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ నాగలక్ష్మి, హెల్త్ సూపర్‌వైజర్ మహేశ్వరరెడ్డి, ఆరోగ్య కార్యకర్త రమేష్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సెల్ఫీ వీడియో తీసుకుని
రైతు ఆత్మహత్యాయత్నం
కళ్యాణదుర్గం రూరల్: తన భూ సమస్యను పరిష్కరించాలని అనేక సార్లు అధికారులకు తెలిపినా ఫలితం దక్కడం లేదంటూ ఓ రైతు గురువారం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అంతకుముందు తన బాధను సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టు వైరల్ అయింది. బాధితుడి తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లుకు చెందిన రైతు బొమ్మయ్యకు గ్రామ సమీపంలోని కొండ వద్ద పొలం ఉంది. ఇటీవల కొండలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు తవ్వకాలు మొదలుపెట్టారు. ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్‌లు చేపట్టారు. ఈ క్రమంలో రాళ్లన్నీ ఎగిరి బొమ్మయ్య పొలంలో పడుతున్నాయి. కళ్యాణదుర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ గోవిందప్పకు చెందిన కంకర మిషన్‌కు టిప్పర్లతో రాళ్లను తరలిస్తున్నారు. దీంతో పొలంలోని పంట నాశనమవుతోంది. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించ లేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన బొమ్మయ్య గురువారం అదే కొండపైకి ఎక్కి తన బాధనంతా సెల్ఫీ వీడియోలో వివరించి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గుర్తించిన స్థానికులు అప్రమత్తమై రైతును కాపాడారు.

తాటిమానుగుంతలో వైద్య శిబిరం

తాటిమానుగుంతలో వైద్య శిబిరం