
కూటమిపై పోరుబాట...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అంగన్‌వాడీలు, ఇతర శాఖల ఉద్యోగులు నిరసన గళం విప్పారు. అయినా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ స్పందించ లేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడబలుక్కుని ఒక్కసారిగా ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యాయి.
కదిరి: ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఉద్యమాలు ఊపందుకున్నాయి. రణభేరి పేరుతో యూటీఎఫ్ ఉద్యమానికి దిగింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఈ నెల 25న విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో రణభేరీ జాతా పేరుతో జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఏపీటీఎఫ్ సైతం వివిధ రూపాల్లో ఉద్యమాలు సాగిస్తోంది. ఈ నెల 11న నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. 12న మండల కేంద్రాల్లో నిరసనలు, 13, 14వ తేదీల్లో ప్రజా ప్రతినిధులకు వినతులు ఇచ్చారు. 15న డివిజన్ కేంద్రాల్లో, 16న జిల్లా కేంద్రంలో నిరసనలు తెలిపారు.
సచివాలయ ఉద్యోగుల నిరసన గళం..
దాదాపు ఏడాదిన్నరగా ఎన్నో వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చిన సచివాలయ ఉద్యోగుల్లో చివరకు సహనం నశించింది. ఈ నేపథ్యంలో తమ ఆత్మ గౌరవాన్ని వదులుకోక తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఇంటింటికీ వెళ్లి వాట్సప్ సేవలపై ప్రచారం చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్దమని, తమ సమస్యలు పరిష్కరించకపోతే అక్టోబర్ 1 నుంచి పింఛన్ల పంపిణీ ఆపేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పోరుబాటలో విద్యుత్ ఉద్యోగులు..
తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖలోని అన్ని యూనియన్లు ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ నెల 15, 16వ తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 17, 18వ తేదీల్లో భోజన విరామ సమయాల్లో ఆందోళనలు చేపట్టారు. 19, 20వ తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. 22న ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించనున్నారు.
● విధులకు సంబంధం లేని సర్వేలు, ఇతర పనుల నుంచి విముక్తి కలిగించాలి.
● శాఖల వారీగా మాతృశాఖలో విలీనం చేయాలి.
● సచివాలయాల్లోని అన్ని విభాగాల ఉద్యోగులకు ఒకే బేసిక్‌తో పదోన్నతి కల్పిస్తూ పీఆర్‌సీ స్లాబ్ వర్తింపజేయాలి.
● సెలవు రోజుల్లో బలవంతపు విధుల నుంచి విముక్తి కలిగించాలి.
● రికార్డు అసిస్టెంట్ క్యాడర్‌ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌గా అప్‌గ్రేడ్ చేయాలి.
● ప్రొబేషన్ కాలానికి గాను నోషనల్ ఇంక్రిమెంట్‌లు ఇవ్వాలి.
● నగదు రహిత వైద్యం అందించాలి.
● 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 మధ్య చేరిన ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
● పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను తక్షణమే చెల్లించాలి.
● ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న సబ్ ఇంజనీర్లకు ఏఈలుగా పదోన్నతుల్లో అవకాశం కల్పించాలి.
● దళారీ వ్యవస్థను రద్దు చేసి కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించాలి.
● మొత్తం 13 రకాల డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఉంచగా.. ఇందులో కాంట్రాక్టు కార్మికులకు సంబందించే 6 డిమాండ్లు ఉన్నాయి.
● పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను తక్షణమే చెల్లించాలి.
● సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
● 12వ పీఆర్‌సీని నియమించి, ఐఆర్ ప్రకటించాలి.
● అన్ని రకాల బకాయిలను తక్షణం చెల్లించాలి.
● యాప్‌ల భారంతో పాటు బోధనేతర పనులను ఎత్తివేయాలి.
● ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ.25లక్షలకు పెంచాలి.
సమస్యల పరిష్కారం కోరుతూ
ఊపందుకున్న ఉద్యమాలు
రణభేరికి సిద్దమైన ఉపాధ్యాయులు
ఉద్యమ బాటలో విద్యుత్ ఉద్యోగులు
నిరసన బాటలో సచివాలయ ఉద్యోగులు
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్‌లు కొన్ని..
టీచర్ల డిమాండ్‌లు కొన్ని..
సచివాలయ ఉద్యోగుల డిమాండ్‌లు ఇవే