
సీఐ శేఖర్‌పై హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు
గోరంట్ల: అధికారాన్ని అడ్డు పెట్టుకుని గోరంట్ల సీఐ బోయ శేఖర్ సాగిస్తున్న అరాచకాలపై మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేయనున్నట్లు వెంకటరమణపల్లి మాజీ ఎంపీటీసీ, టీడీపీ నేత హంపయ్య పేర్కొన్నారు. బీజీపీలో కొనసాగుతున్న తన మేనల్లుడు నరేష్‌ను బుధవారం ఓ కేసు విషయంగా విచారణకు పిలుచుకెళ్లిన సీఐ శేఖర్ థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని ఆయన ఆక్షేపించారు. గురువారం ఆయన గోరంట్లలో నరేష్ సోదరుడు మహేష్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నరేష్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమే కాక పత్రికల్లో రాయలేని పదజాలంతో కుటుంబ సభ్యులనూ దూషించిన సీఐ శేఖర్ తీరుతో బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఎదుట తన మేనల్లుడు ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. దీనిని పోలీసులు సకాలంలో భగ్నం చేయడంతో అదే రోజు రాత్రి విషపూరిత ద్రావకం తాగాడన్నారు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆగమేఘలపై కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు. ప్రస్తుతం కదిరి ఆస్పత్రిలోనే నరేష్ చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. వ్యక్తిగత కక్షతో అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న సీఐ శేఖర్‌పై పోలీసు ఉన్నతాధికారులతో పాటు హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రైవేట్ కేసు దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
మహేష్ మాట్లాడుతూ... 2014లో రాజకీయ కారణాలతో తన సోదరుడు నరేష్ తో పాటు తనపై కూడా పోలీసులు రౌడీషీట్ తెరిచారని గుర్తు చేశారు. తమపై రౌడీషీట్ ఉన్నా సత్ప్రవర్తనతోనే మెలుగుతూ వచ్చామన్నారు. ఈ 11 ఏళ్లలో తమపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కేవలం రౌడీషీట్ ఉందనే కారణంతో తమను సీఐ శేఖర్ బుధవారం పీఎస్‌కు పిలిపించుకుని నరేష్‌ను నానా చిత్రహింసలకు గురి చేశారన్నారు. రెండు నెలల క్రితం గోరంట్ల బస్టాండ్ సమీపంలో ఆర్‌అండ్‌బీ ప్రహరీ కూల్చివేతలో తన ప్రమేయం లేకపోయినా స్టేషన్‌కు పిలిపించుకుని దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ శేఖర్ తీరుతో పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మంట కలుస్తోందని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నేత హంపయ్య