
మరుగుదొడ్లు శిథిలం
పుట్టపర్తిలో నిత్యం విద్యుత్ కోతలతో భక్తులతో పాటు పట్టణ వాసులు కూడా అల్లాడిపోతున్నారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయకపోతే ఇబ్బందులు అధికం కానున్నాయి. ఉన్న హైమాస్ లైట్లు కూడా వెలగడం లేదని, కొత్తవి ఎప్పుడు ఏర్పాటు చేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అలాగే పట్టణానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎక్కడా వంద మందికి అవసరమైన మరుగుదొడ్లు లేవు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినా ఇబ్బందులు తప్పవు. గతంలో నిర్మించిన శాశ్వత మరుగుదొడ్లు నిర్వహణా లోపంతో శిథిలమయ్యాయి. మహిళలు, పిల్లలు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.