మహిళా పక్షపాతి
వైఎస్సార్ తన హయాంలో మహిళాభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. పావలా వడ్డీ పథకం ద్వారా ఎందరో జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపారు. అలాగే ఏ ఆసరా లేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ అందించారు. ఇందిరమ్మ ఇళ్లు, అభయహస్తం, రూ.2లకే కిలో బియ్యం, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి చెరగని ముద్రవేశారు.
కదిరి/అనంతపురం అగ్రికల్చర్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో కుల, మత, పార్టీలకు అతీతంగా పాలన సాగించారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందించారు. ఆపదలో ఆపన్నహస్తంలా 108 అంబులెన్స్ సేవలు, నడిచే వైద్యశాలగా పేరున్న 104 సేవలను అందుబాటులోకి తెచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేదింటి బిడ్డల పెద్ద చదువులకు బాసటగా నిలిచారు. ఆరోగ్యశ్రీ ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఖరీదైన వైద్యం చేయించారు.
రైతు నేస్తం..
2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ఉచిత కరెంటు, విద్యుత్ బిల్లుల మాఫీ చేస్తూ తొలిసంతకంతోనే వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఊపిరిపోశారు. ఉమ్మడి జిల్లా రైతులకు చెందిన రూ.70.65 కోట్ల విద్యుత్ బిల్లులు మాఫీ చేశారు. ఐదేళ్లూ 1.75 లక్షల వ్యవసాయ మోటార్లకు రూ.వందల కోట్లు విలువ చేసే కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. అలాగే 2004కు ముందు రూ.1000 కోట్ల లోపున్న పంట రుణాలను రూ.6,594 కోట్లకు చేర్చారు. పావలా వడ్డీ కింద రూ.44 కోట్లు ఇచ్చారు. పంటల బీమా పథకాన్ని రైతులకు మేలు జరిగేలా మార్పు చేసి అంతులేని ధీమా కల్పించారు. 2004–2009 మధ్య వేరుశనగ రైతులకు పంట కోత ఫలితాల ఆధారంగా బీమా కింద ఏకంగా రూ.1138 కోట్లు పరిహారం ఇచ్చారు. అలాగే ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.100 కోట్లు ఇచ్చారు. 2008లో 3,03,937 మంది రైతులకు చెందిన రూ.554.92 కోట్ల రుణాలు ఒకేవిడతలో మాఫీ చేశారు. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులకు కూడా ప్రోత్సాహకాల కింద 3,61,269 మందికి రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. 2004– 2009 వరకు ఆరేళ్ల కాలంలో 28,05,901 మంది రైతులకు రూ.280.88 కోట్ల రాయితీతో 26,02,717 క్వింటాళ్ల వేరుశనగ, అలాగే కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు. ఇక అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటలు, డ్రిప్, స్ప్రింక్లర్ల రైతులకు కూడా చేయూతను అందించారు. రూ.25 కోట్లు రాయితీ ఇచ్చి పశుక్రాంతి, జీవక్రాంతి కింద 50 శాతం రాయితీతో మేలుజాతి పశువులు, గేదెలు అందజేసి క్షీరవిప్లవానికి శ్రీకారం చుట్టారు. 40 వేల హెక్టార్ల పండ్లతోటల విస్తరణకు రూ.80 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. దీంతో అప్పట్లోనే ‘ఫ్రూట్‌బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరొచ్చింది. రైతులకు బిందు, తుంపర పరికరాలు... ఎస్సీ ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో ఇచ్చారు. సూక్ష్మసేద్యం విస్తరణకు రూ.280 కోట్లు రాయితీ ఇవ్వడంతో 1.13 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఇవే కాకుండా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలు ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.
వైఎస్సార్ హయాంలో ఎంతో అభివృద్ధి
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శ్రీసత్యసాయి జిల్లా (అప్పట్లో ఉమ్మడి అనంతపురం జిల్లా) ఎంతో అభివృద్ధి చెందింది. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ఎంతోమందికి లబ్ధి చేకూరింది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మిల్స్‌బల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. లోఓల్టేజీ కరెంటుతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రతి మండలంలో సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాటి సామర్థ్యాన్ని కూడా పెంచారు.
కదిరి పట్టణ ప్రజలు తాగునీటికోసం అల్లాడి పోతున్న విషయాన్ని గమనించిన వైఎస్సార్.. ఏకంగా రూ.100 కోట్లతో మంచినీటి పథకాన్ని చేపట్టి శాశ్వత పరిష్కారం చూపారు.
హంద్రీనీవా పథకం ద్వారా కదిరి ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకొచ్చారు.
కదిరి మండలం చెర్లోపల్లి వద్ద హంద్రీనీవా రిజర్వాయర్‌ను నిర్మించారు.
పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలకు హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను తెచ్చారు.
ధర్మవరం పట్టణ ప్రజల దాహార్తి తీర్చడం కోసం రూ.84 కోట్లతో ‘కేతిరెడ్డి సూర్యప్రతాప్‌రెడ్డి శాశ్వత మంచినీటి పథకం’ పేరుతో పార్నపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొచ్చి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.
చేనేత రుణమాఫీతో జిల్లాలోని చేనేతలకు ఆర్థికంగా అండగా నిలిచారు.
హిందూపురంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు డాక్టర్ వైఎస్సార్ సుమారు రూ.600 కోట్లతో శాశ్వత మంచినీటి పథకాన్ని చేపట్టారు.
పెనుకొండ నియోజకవర్గానికి హంద్రీనీవా కాలువలు తవ్వించారు.
మడకశిర నియోజకవర్గంలోని ప్రతి పల్లెకూ రోడ్లు వేశారు. తాగునీటి సమస్య తీర్చారు.
సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న మడకశిర నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి చూసి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా నియోజక వర్గానికి కృష్ణా జలాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు.
మడకశిర నియోజకవర్గంలోని వక్కలిగలను బీసీ కేటగిరీలోకి మార్చారు. ఫలితంగా ఆ సామాజిక వర్గంలోని ఎందరో రిజర్వేషన్ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన మేళ్లు ఎన్నో... అందుకే జనమంతా ఇప్పుడు ఆయన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు.
ప్రజా సంక్షేమమే రాజన్న శ్వాస
ఆయన హయాంలో అభివృద్ధికి పెద్దపీట
జనరంజక పాలనకు ఆయనే చిరునామా
ఏపీ రూపురేఖలు మార్చిన మహానేత
నేడు వైఎస్సార్ వర్ధంతి
ఆయన్ను కొలవని పల్లె లేదు
ఆయన్ను తలవని తల్లి లేదు
అపన్నులకు ఆత్మబంధువు
అభాగ్యుల పాలిట కల్పతరువు
కుయ్‌కుయ్ మనే 108 సైరన్‌లో..
పేదవాడి గుండెచప్పుడులో..
కూలి కష్టంలో...రైతు స్వేదంలో..
నిరుపేద ఇంట వెలిగిన అక్షర కాంతిలో..
కూలీలు కలిపే అన్నం ముద్దలో..
అక్కచెల్లెమ్మల అభివృద్ధి పథంలో..
పారే నీరులో...పచ్చని పొలంలో
కనిపిస్తూనే ఉంటారు..
భౌతికంగా దూరమైనా..
నమస్తే అక్కయ్యా... నమస్తే అన్నయ్యా..
నమస్తే తమ్ముడూ.. నమస్తే చెల్లెమ్మా..
అంటూ ఆప్యాయతతో కూడిన ఆ పిలుపు
వినిపిస్తూనే ఉంటుంది.
వైఎస్సార్..ఈ పేరు వినగానే తెలుగునేల మీద ఉన్న ప్రతి గుం
వైఎస్సార్..ఈ పేరు వినగానే తెలుగునేల మీద ఉన్న ప్రతి గుం