
పాత కక్షలతో దాడి
కదిరి అర్బన్: మండలంలోని పట్నం గ్రామంలో సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న దాడుల్లో నలుగురికి గాయాలయ్యాయి. పట్నం గ్రామానికి చెందిన వెంకటేష్, చెన్నయ్య, శ్రీనివాసులు, ఆయన కుమార్తె అంజలిపై అదే గ్రామానికి చెందిన సూరి, ఆయన కుమారులు అరవింద్, అశోక్, నాని కొడవలితో దాడి చేశారు. పశువుల మేత మేస్తున్న ప్రదేశానికి సంబంధించి ఆదివారం రాత్రి వెంకటేష్ బంధువుకి, సూరికి మధ్య గొడవ జరిగింది. గతంలోనే వీరి మధ్య గొడవలు ఉన్నాయి. పాతకక్షలను దృష్టిలో ఉంచుకుని దాడులకు పాల్పడినట్లు సమాచారం. క్షతగాత్రులను కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు కేసు దర్యాప్తు చేపట్టిన సీఐ నిరంజనరెడ్డి తెలిపారు.