
రైతు ఆత్మహత్య
ధర్మవరం రూరల్: మండలంలోని ఆర్.యర్రగుంటపల్లికి చెందిన రైతు మండ్లి నాగేంద్ర (44) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య బొజ్జక్క, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న 5 ఎకరాల పొలంలో వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో పంటల సాగుకు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడంతో పాటు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. దీనికి తోడు కుటుంబంలో కలహాలు మొదలు కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన సోమవారం రాత్రి కలుపు నివారణ మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న నాగేంద్రను కుటుంబసభ్యులు గమనించి ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ విఫలం..
బీటెక్ విద్యార్థి ఆత్యహత్య
తాడిపత్రి రూరల్: ప్రేమ విఫలమై తాడిపత్రి మండలం ఆలూరు గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి నవీన్‌కుమార్ (19) ఆత్మహత్య చేసుకున్నాడని సోమవారం అప్‌గ్రెడ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు. పట్టణ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న నవీన్‌కుమార్ ఆదివారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాస్కెట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
అనంతపురం: బాస్కెట్ బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు జిల్లాకు చెందిన పుట్లూరు సోహన ఎంపికై ంది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు పంజాబ్‌లోని లూథియానాలో జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి.

రైతు ఆత్మహత్య