
గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
లేపాక్షి: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటనారాయణ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం లేపాక్షిలోని హౌసింగ్ కార్యాలయంలో ఏపీఏంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్, ఎంపీడీఓ నరసింహమూర్తితో కలసి గృహ నిర్మాణాలపై హౌసింగ్ ఇంజనీర్ల అసిస్టెంట్లతో ఆయన సమీక్షించారు. మండల వ్యాప్తంగా వివిధ దశలో 300 ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటి నిర్మాణాలు పూర్తి చేసేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇంటి నిర్మాణం చేపట్టి పూర్తి చేయని ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ. 75 వేలు అదనంగా చెల్లిస్తారన్నారు. ఇంటి స్థలాలు ఉండి గృహ నిర్మాణం మంజూరుకు 872 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారని, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.50 లక్షలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
హౌసింగ్ పీడీ వెంకటనారాయణ