
వినాయక.. సెలవిక
ధర్మవరం అర్బన్: వినాయక ఉత్సవాల్లో ఐదోరోజు ఆదివారం ధర్మవరం, కదిరి, హిందూపురం తదితర ప్రాంతాల్లో భారీ ప్రతిమల నిమజ్జనం భక్తిశ్రద్ధల నడుమ సాగింది. మంటపాల్లో కొలువుదీరిన గణేశుడు ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలందుకున్నారు. నిమజ్జనం సందర్భంగా అన్నదానాలు.. లడ్డూ ప్రసాదాల వేలం నిర్వహించారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేక వాహనాల్లోకి విగ్రహాలను కొలువుదీర్చి ఊరేగింపుగా తీసుకెళ్లారు. డ్రమ్స్ వాయిద్యాల నడుమ యువత, మహిళలు, చిన్నారులు చిందులు వేశారు. గణపతి బప్పా మోరియ.. జై బోలో గణేశ్ మహరాజ్‌కీ జై.. పార్వతీ తనయుడు వినాయకునికి జై అంటూ నినదించారు. అనంతరం చెరువులు, కాలువలు, నీటి కుంటలు, వంకల్లో నిమజ్జనం చేశారు.

వినాయక.. సెలవిక

వినాయక.. సెలవిక