
గణేశ్ శోభాయాత్రలో అపశ్రుతి
హిందూపురం: గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిదానంగా ముందుకు సాగుతున్న వేళ డ్రైవర్ ఉన్నపళంగా ఎక్సలేటర్ తొక్కడంతో ట్రాక్టర్ ముందు భాగంలో ఉన్న భక్తులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. హిందూపురంలోని మారుతినగర్ మెయిన్‌రోడ్డులో శుక్రవారం నిమజ్జనం కోసం గణేశ్ విగ్రహాల ఊరేగింపు జరుగుతోంది. ఓ ట్రాక్టర్ ముందు భాగంలో భక్తులు నృత్యాలు చేసుకుంటూ వస్తుండగా.. డ్రైవర్ అకస్మాత్తుగా ఎక్సలేటర్ తొక్కాడు. అంతే ట్రాక్టర్ ఒక్క ఉదుటున ముందుకు వేగంగా కదిలి.. సౌభాగ్యమ్మ, మారుతి, ఆదర్శ, మమత, ఉమాదేవి, దీక్షిత, వేదవతి, గంగరత్నమ్మ, కీర్తనపైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మారుతి (35)తో పాటు సౌభాగ్యమ్మ తలకు తీవ్రగాయాలై పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మారుతి చనిపోయాడు. మిగిలిన క్షతగాత్రులు హిందూపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
● ఇదిలా ఉండగా హిందూపురం మండలం బాలంపల్లి వద్ద ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న మనోహర్ అనే యువకుడు స్పీడ్ బ్రేకర్‌ను గమనించకుండా అలాగే పోనివ్వడంతో ఎగిరి కిందపడ్డాడు. తలకు గాయాలయ్యాయి.
ట్రాక్టర్ దూసుకెళ్లి యువకుడి మృతి
మరో 8 మందికి గాయాలు

గణేశ్ శోభాయాత్రలో అపశ్రుతి