
సమాధులే దేవాలయాలు
ధర్మవరం రూరల్: మండలంలోని సుబ్బరావుపేట గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. గ్రామంలోని ఓ కుటుంబం వారు వారి పితృదేవతలను మరచిపోకుండా వారి సమాధులపై విగ్రహాలు ఏర్పాటు చేసుకుని పూజిస్తున్నారు. గ్రామంలోని బొమ్మయ్య కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. బొమ్మయ్య వంశానికి చెందిన సుమారు 20 కుటుంబాలు ఉన్నాయి. వీరి కుటుంబాలలో ఎవరైనా మృతి చెందితే గ్రామం వెలుపల ప్రత్యేక స్థలంలో ఖననం చేసి సమాధులు నిర్మిస్తారు. అనంతరం వాటిపై వారి ముఖచిత్రాన్ని పోలిన విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పూజిస్తుంటారు.
ఏటా సమాధుల వద్ద పరుష
ఏటా విత్తన ఏకాదశి రోజున సమాధుల వద్ద పరుష నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ సమాధులకు పూజలు చేసిన అనంతరం గ్రామంలో ఉన్న గంగమ్మ ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ పరుషకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారని బొమ్మయ్య వంశస్తులు చెపుతున్నారు.
బొమ్మయ్య సమాధికి పూజలు చేసిన దృశ్యం (ఫైల్)
పరుష సందర్భంగా సమాధుల వద్ద
పూజలు చేస్తున్న దృశ్యం (ఫైల్)
సుబ్బరావుపేటలో వింత ఆచారం
సమాధుల వద్ద ఏటా ఉత్సవాలు
పితృదేవతల ఆశీస్సుల కోసం
పితృదేవతల ఆశీస్సుల కోసం మా వంశస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. వారి రూపాలను సమాధులపై నిర్మించుకుంటాం. విత్తన ఏకాదశి రోజున సమాధుల వద్ద పరుష నిర్వహిస్తాం. మా ఇళ్లల్లో పుట్టిన మగ పిల్లలకు బొమ్మయ్య అనే పేరు తప్పనిసరిగా పెట్టుకుంటాం. గంగమ్మను మా ఇలవేల్పుగా పూజిస్తుంటాం. గ్రామంలో నిర్మించిన గంగమ్మ దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సమాధుల వద్దకు తీసుకెళ్లి అక్కడ కూడా పూజలు చేస్తుంటాం.
– నడిపి బొమ్మయ్య, గంగమ్మ ఆలయ పూజారి, సుబ్బరావుపేట

సమాధులే దేవాలయాలు

సమాధులే దేవాలయాలు

సమాధులే దేవాలయాలు