ఏ నోట విన్నా.. అదే చర్చ! | - | Sakshi
Sakshi News home page

ఏ నోట విన్నా.. అదే చర్చ!

Aug 27 2025 8:15 AM | Updated on Aug 27 2025 8:15 AM

ఏ నోట విన్నా.. అదే చర్చ!

ఏ నోట విన్నా.. అదే చర్చ!

కదిరి: పట్టణంలో ఇప్పుడు గంజాయి హాట్‌ టాపిక్‌గా మారింది. ఏ టీ కొట్టులో కూర్చొన్నా దానిపైనే చర్చ జరుగుతోంది. ఏడాదిగా కదిరి ప్రాంతంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా గంజాయి విక్రయాలు జరుపుతున్న కీలక సూత్రధారులను కదిరి పోలీసు అధికారులు ఈ కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలున్నాయి. ఇందుకుగాను రూ.30 లక్షలు ముడుపులను పోలీసులు దండుకున్నట్లు చర్చ జోరుగా సాగుతోంది. ఇందులో రూ.10 లక్షల వరకు జిల్లా కేంద్రానికి కూడా చేరినట్లు వినబడుతోంది.

దాచేస్తే దాగదులే..

కదిరి మండలం కొండమనాయునిపాళ్యం వద్ద ఈ నెల 26న మంగళవారం గంజాయి ముఠాను అరెస్ట్‌ చేస్తే 4 రోజుల తర్వాత అంటే ఈ నెల 29న శుక్రవారం అరెస్ట్‌ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ జాప్యం వెనక ఆంతర్యమేమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అప్పటికే గంజాయి పట్టుబడిన విషయం మీడియాలోనే కాకుండా సోషల్‌ మీడియాలోనూ బాగా వైరల్‌ అయింది. లేదంటే ఈ కేసు నమోదయ్యేదే కాదు. గంజాయి అసలు సూత్రధారులతో స్థానిక పోలీసు అధికారులకు డీల్‌ కుదిరిన తర్వాతే అరెస్ట్‌ వివరాలు వెల్లడించారని కొందరంటున్నారు.

వారంతా కూలీలే

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కదిరితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. కూటమి నేతలే కొందరు ఈ దందాను నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలోని జలగాం జిల్లా ప్రజాపూర్‌లోని వాటర్‌ ట్యాంక్‌ ఏరియాలో ఉంటున్న రవి అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైళ్లు, బస్సుల్లో ఎంపిక చేసుకున్న కూలీల ద్వారా ఇక్కడికి తెప్పిస్తున్నారు. కూలీలకు రైలు లేదా బస్సు చార్జీలు ఇవ్వడంతో పాటు కిలోకు రూ.1000 చొప్పున కూలి చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కదిరి రూరల్‌ పోలీసులకు పట్టుబడిన స్థానిక జామియా వీధికి చెందిన అజాజ్‌, నాగరాజు వీధికి చెందిన షోయబ్‌, గాంధీనగర్‌కు చెందిన ఆర్ఫాన్‌, మహమ్మద్‌ హుస్సేన్‌, అస్లాం, గౌసియా వీరంతా కమీషన్‌ ప్రాతిపదికన గంజాయిని తెచ్చే కూలీలు మాత్రమే. దీని వెనుక అసలు సూత్రధారులు వేరే ఉన్నారని తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత ఇంట్లో చర్చలు జరిపిన అనంతరం కీలక నిందితులను తప్పించి, కేవలం కూలీల పేర్లు మాత్రమే వెల్లడించేలా ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అసలు సూత్రధారులు ఎవరనే విషయం స్థానికంగానే కాకుండా ఉన్నతాధికారులకు సైతం బాగా తెలుసని, అయితే వారు దీనిని శ్రీమూమూలుశ్రీగా తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. గంజాయి అక్రమ రవాణాను అరికట్టి అసలు సూత్రధారుల ఆట కట్టించకపోతే యువత గంజాయికి బానిసై చెడుమార్గంలో వెళ్లడం ఖాయమని పలువురు అంటున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికై నా సీరియస్‌గా తీసుకుని గంజాయిని అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

గంజాయి కేసులో కూలీలను అరెస్టు చూపి కీలక నిందితులను తప్పించిన పోలీసులు

ప్రస్తుతం కదిరిలోని ప్రతి టీ కొట్టులోనూ ఇదే అంశంపై చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement