
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
మడకశిర: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు చంద్రబాబు మోసాలను ఊరూరా వివరించాలని వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత అందరిపై ఉందన్నారు. సోమవారం పట్టణంలోని షాదీమహల్‌లో పార్టీ సమన్వయకర్త ఈరలక్కప్ప అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ గ్రామ పంచాయతీ, వార్డుల స్థాయిల్లో ఏర్పాటు చేసిన పార్టీ అనుబంధ కమిటీల నూతన సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్‌రెడ్డి మాట్లాడుతూ...పార్టీ అనుబంధ కమిటీల్లోని సభ్యులు వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. వైఎస్ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. 14 నెలల కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించి మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పని చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శులు వజ్ర భాస్కర్‌రెడ్డి, మధుమతిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను చంద్రబాబు ఎలా మోసం చేశారో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్నారు.
బాధ్యతాయుతంగా పని చేయాలి: ఈరలక్కప్ప
నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప మాట్లాడుతూ... గ్రామ, వార్డుల స్థాయిల్లోని వివిధ కమిటీలకు నూతనంగా ఎన్నికై న సభ్యులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించి ప్రజలకు దగ్గర కావాలని సూచించారు. సమావేశంలో మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రతినిధి జీను మహేష్, జిల్లా అధికార ప్రతినిధి ఆనంద రంగారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, కుంచిటి వక్కలిగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంగేగౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంతరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, ఆయా మండలాల పార్టీ ఇన్‌చార్జ్‌లు గంగుల సుధీర్‌రెడ్డి, భారతిరెడ్డి దేశాయి, సాయిలీల, లింగారెడ్డి, పట్టణ కన్వీనర్ బోయ సతీష్‌కుమార్, మండల కన్వీనర్లు నరసింహారెడ్డి, డీఎల్ యంజారేగౌడ్, త్రిలోక్‌నాథ్, శ్రీనివాస్, రామిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జయరాజ్, ఎంపీపీలు ఈరన్న, సత్యనారాయణరెడ్డి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, నియోజకవర్గ స్థాయి వివిధ విభాగాల అధ్యక్షులు, పంచాయతీ, వార్డుల ఇన్‌చార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు మోసాలను
ఊరూరా వివరించాలి
వైఎస్సార్‌సీపీ హిందూపురం
పార్లమెంట్ పరిశీలకుడు రమేష్‌రెడ్డి

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి