
రెస్టారెంట్ సీజ్
కదిరి టౌన్: స్థానిక అరబిక్ రెస్టారెంట్‌ను మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్ ఆదివారం సీజ్ చేశారు. ఇప్పటికే అందిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఆదివారం మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రెస్టారెంట్‌లో ఆహార పదార్థాల నాణ్యత లోపం, అపరశుభ్రత ప్రదేశంలో ఆహార పదార్థాలు నిల్వ, తిని వదిలేసిన చికెన్, మటన్ ముక్కలను తిరిగి వడ్డిస్తున్నట్లుగా తనిఖీల్లో గుర్తించారు. కుళ్లిన చికెన్, మటన్ వండుతుండడం, గడువు తీరిన మసాలాలు వినియోగించడాన్ని మున్సిపల్ కమిషనర్ గుర్తించి రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీశారు. అనంతరం రెస్టారెంట్‌ను సీజ్ చేశారు.