
● అ‘పూర్వ’ సమ్మేళనం
మడకశిర: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1978–80 విద్యాసంవత్సరంలో ఇంటర్ చదివిన వారు అదే కళాశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. దాదాపు 47 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. నాటి చిలిపి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిని పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.