
హత్య కేసులో నిందితుడి అరెస్టు
ధర్మవరం అర్బన్: పట్టణంలో రెండురోజుల క్రితం జరిగిన మెకానిక్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన భార్యపై కన్నేసిన తమ్ముడిని అన్న హత్య చేశాడని డీఎస్పీ హేమంత్‌కుమార్, వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేతిరెడ్డి కాలనీ ఎల్–2కి చెందిన పాళ్యం శివయ్య పిన్నమ్మ కుమారుడు కేతిరెడ్డి కాలనీ ఎల్–3కి చెందిన పాళ్యం ధనుంజయ అన్నదమ్ములు. ఇద్దరూ స్నేహంగా ఉంటూ మద్యం సేవించేవారు. ధనుంజయ తన అన్న శివయ్య భార్యపై కన్నేసి ఆమెతో పలుమార్లు చెడుగా ప్రవర్తించేవాడు. చాలాసార్లు శివయ్య... ధనుంజయను మందలించాడు. అయినా ధనుంజయలో మార్పు రాలేదు. దీంతో ఈనెల 21న అర్ధరాత్రి సమయంలో ఎల్‌పీ సర్కిల్‌లోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఓపెన్ జిమ్ వద్ద ధనుంజయను సిమెంట్ ఇటుకతో పాటు బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. పరారీలో ఉన్న శివయ్యను అరెస్టు చేశామన్నారు.
తన భార్యపై కన్నేసిన
తమ్ముడిని హతమార్చిన అన్న
రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు