
పింఛన్ తొలగించారని దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం
గాండ్లపెంట: మండల పరిధిలోని గొడ్డువెలగల పంచాయతీ పల్లోల్లపల్లికి చెందిన దివ్యాంగుడు నాగార్జున గురువారం ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకెళితే.. నాగార్జున రెండేళ్లుగా దివ్యాంగ పింఛన్ అందుకుంటున్నారు. అయితే రీవెరిఫికేషన్‌లో తన పింఛన్‌ను తొలగించడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న కుమారుడిని చూసి తండ్రి శ్రీరాములు వెంటనే కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఓటరు జాబితా తయారీకి సహకరించండి
ప్రశాంతి నిలయం: ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలనికలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎన్నికల అధికారులతో కలసి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ జిల్లాలో బూత్ స్థాయి ఏజెంట్లను గుర్తించాలని, ఓటరు జాబితాలో తప్పులు గుర్తించి ఉంటే సదరు జాబితాను వచ్చే సమావేశంలో సమర్పించాలన్నారు.
పట్నం పూర్వపు ఎస్‌ఐ
రాజశేఖర్‌పై కేసు నమోదు
గుత్తి: న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించి ఉద్యోగం పోగొట్టుకున్న ముదిగుబ్బ మండలం ‘పట్నం’ పూర్వపు ఎస్‌ఐ రాజశేఖర్‌పై గుత్తి పోలీసులు కేసు నమోదు చేశారు. గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన ఓ మహిళ ఎస్‌ఐ రాజశేఖర్‌పై ఫిర్యాదు చేయగా.. సీఐ వెంకటేశ్వర్లు సమగ్రంగా విచారించి రాజశేఖర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, లైగింక వేధింపులతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. కాగా, సమస్య పరిష్కారం కోసం పట్నం పోలీసు స్టేషన్‌కు వచ్చిన గిరిజన మహిళను ఎస్‌ఐ హోదాలో ఉన్న రాజశేఖర్ లైంగికంగా వేధించిన వైనంపై ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన ఎస్పీ రత్న తొలుత రాజశేఖర్‌ను వీఆర్‌కు పంపారు. అనంతరం విచారణ జరిపారు. రాజశేఖర్ లైంగిక వేధింపులు నిజమని తేలడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ రాయలసీమ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా లైంగిక వేధింపులపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.