
పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
పుట్టపర్తి అర్బన్: గ్రామీణ మంత్రిత్వ శాఖ, కెనరా బ్యాంకు సహకారంతో ప్రారంభించిన స్వయం ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కలెక్టర్ చేతన్ సూచించారు. గురువారం పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పురుషులకు మోటర్ సైకిల్ సర్వీసింగ్, సెల్‌ఫోన్ రిపేరీ, ఫొటో, వీడియోగ్రఫీ, ఎలక్ట్రికల్ వైరింగ్, పంప్‌సెట్ రిపేరీ, డ్రస్ డిజైనింగ్, ట్యాలీ నేర్పించనున్నట్లు చెప్పారు. సీ్త్రలకు బ్యూటీపార్లర్, డ్రస్ డిజైనింగ్, పెళ్లి కూతురు మేకప్, జ్యూట్ బ్యాగ్‌ల తయారీ, మెహందీ, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, కొవ్వొత్తుల తయారీ, జర్దోసి వంటి వాటిపై శిక్షణ ఇస్తారన్నారు. భోజనం, వసతి సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. ఎల్‌డీఎం రమణకుమార్, కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు, సీబీఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్ శాంతిప్రియ, పరిశ్రమలశాఖ జీఎం నాగరాజు పాల్గొన్నారు.
పోస్టర్లు ఆవిష్కరణ..
విద్యార్థుల ప్రతిభను వెలికితీసే పోటీలకు సంబంధించిన ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్ పోస్టర్లను బ్యాంకర్లతో కలిసి కలెక్టర్ చేతన్ ఆవిష్కరించారు. 18 నుండి 25 సంవత్సరాల యువతీ యువకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఈ నైపుణ్య పోటీలు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. 63 విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 9988853335 నంబర్‌ను సంప్రదించాలన్నారు.