
సహకార సంఘాల అభివృద్ధికి కృషి
గుడిబండ: సహకార సంఘాలను బలోపేతం చేసి రైతులు, మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి టి.కె.అనిల్‌కుమార్ అన్నారు. గుడిబండ మండలం కరికెర, గుడిబండ గ్రామాల్లో సెర్ప్ సీఈఓ వాకాటి అరుణతో కలసి మంగళవారం ఆయన పర్యటించారు. ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాటు చేసిన జీవనోపాదుల సేవా కేంద్రాలను సందర్శించారు. అనంతరం గుడిబండలో ఎఫ్‌పీఓలు ఏర్పాటు చేసిన స్టాళ్నలు పరిశీలించి, ‘మన డబ్బులు– మన లెక్కలు’ యాప్‌ను ప్రారంబించారు. ఈ సందర్భంగా వాకాటి అరుణ మాట్లాడుతూ.. మన డబ్బులు– మన లెక్కలు యాప్‌లో మహిళా సంఘాల సభ్యుల పొదుపులు, చెల్లించిన అప్పుల వివరాలు, సంఘ సభ్యుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం, పారదర్శకమైన లెక్కలు ఉంటాయన్నారు. అనంతరం రైతు సంఘాల సభ్యులకు చేకూరిన లబ్ధి, ఎల్‌ఎస్‌సీ ఉపయోగాలు, అనుబంధ శాఖల సేవలపై కమిటీ సభ్యులతో చర్చించి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సెర్ప్ అదనపు సీఈఓ శ్రీరాములనాయుడు, సీ్త్రనిధి ఎండీ హరిప్రసాద్, ఉన్నతి డైరెక్టర్ శివశంకర్‌ప్రసాద్, ఉమ్మడి జిల్లా డీఆర్‌డీఏ పీడీలు నరసయ్య, శైలజ, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి టి.కె.అనిల్‌కుమార్