
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
సోమందేపల్లి : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ ీసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మహిళలతో వీడియో కాల్‌లో ప్రవర్తించిన తీరును నిరసిస్తూ మంగళవారం సోమందేపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ... టీడీపీ ఎమ్మెల్యే నసీర్ ప్రవర్తించిన తీరును సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఓ మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం దుర్మార్గమన్నారు. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా ఓ మహిళ పట్ల గతంలో వ్యవహరించిన తీరు నిజంగా దారుణంగా ఉందన్నారు. ఇక హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచరుడు ఇటీవల ఓ మహిళను లైంగికంగా వేధించడం... రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనలు రాష్ట్రంలో మహిళ రక్షణను ప్రశ్నార్థకం చేశాయన్నారు. రాష్ట్రంలో మహిళలపై రోజూ ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతున్నా.. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మహిళల రక్షణ కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘దిశ’ యాప్‌ను తీసుకువస్తే... కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఇప్పటికై నా కూటమి సర్కార్ మహిళల రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఎమ్మెల్యే నసీర్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్, వైఎస్సార్ సీపీ మాజీ మండల కన్వీనర్లు వెంకటరత్నం, నారాయణరెడ్డి, సర్పంచ్‌లు రామాంజి, కిష్టప్ప, పరంధామ, వైస్ సర్పంచ్ వేణు, నాయకులు లక్ష్మీ నరసప్ప, మంజు, నాగమణి, ఆదినారాయణరెడ్డి, నరసింహ మూర్తి, ఈశ్వర్, నాగప్ప, రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే నసీర్ రాజీనామా చేయాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్ డిమాండ్