
బీమా రాలేదు
నేను మామిడి, చీనీ పంటలు సాగు చేశా. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా కింద చీనీ పంటకు క్రమం తప్పకుండా నాలుగేళ్లు ఎకరాకు రూ.20 వేల చొప్పున జమ చేసింది. ఈ సీజన్‌లో మామిడి పంటకు ఎకరాకు రూ.1,800 ప్రీమియం కట్టినా.. ఇప్పటి వరకు బీమా సొమ్ము జమకాలేదు. జమ అవుతోందో కాదో కూడా తెలియడం లేదు.
–ఆవుటాల ఓబిరెడ్డి,
బుచ్చయ్య గారిపల్లి, బుక్కపట్నం మండలం
ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి
వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి సర్కార్ కొనసాగించాలి. ప్రీమియం చెల్లించాల్సి వచ్చినా ప్రభుత్వం కట్టాలి. రెండేళ్లుగా మామిడి, చీనీ పంటలు పండక, పండినా గిట్టు బాటు ధర లేక నాలాంటి సన్నకారు రైతులు పెద్ద ఎత్తున నష్ట పోయారు. పెట్టుబడి కూడా చేతికందలేదు. ప్రభుత్వం స్పందించి ఎకరాకు కనీసం రూ.40 వేల పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – లోసారి వెంకట్రాముడు,
కడపనాగేపల్లి, బుక్కపట్నం మండలం
పెట్టుబడి దక్కలేదు
ఈ ఏడాది వాతావరణ మార్పులతో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. అరకొరగా పండిన పంటకూ గిట్టుబాటు ధర లేక పెద్ద ఎత్తున నష్ట పోయాం. దీంతో పెట్టుబడులు కూడా రాక రైతులంతా అప్పుల పాలయ్యారు. కూటమి సర్కార్ మానవతా దృక్పథంతో మామిడి రైతులను ఆదుకోవాలి. జగన్ హయాంలో మాదిరి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. – గంగురులప్ప, బుచ్చయ్యగారిపల్లి,
బుక్కపట్నం మండలం
●

బీమా రాలేదు

బీమా రాలేదు