
బంగారు గొలుసు అపహరణ
గుంతకల్లు టౌన్: స్థానిక హనుమేష్‌నగర్ ఎల్‌ఐసీ కార్యాలయం గురువారం రాత్రి చైన్‌స్నాచింగ్ జరిగింది. తన సోదరి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న మల్లీశ్వరి అనే మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కొని ఉడాయించాడు. బాధితురాలు తెలిపిన మేరకు.. మల్లీశ్వరి కర్నూలు జిల్లా మద్దికెర సుబ్రమణ్యస్వామి ఆలయంలో పనిచేస్తోంది. పనిపై తన ఇంటి నుంచి పక్క వీధిలో ఉంటున్న తన అక్క సులోచన ఇంటికి గురువారం రాత్రి నడుచుకుంటూ వెళుతుండగా బైక్‌పై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని ఉడాయించాడు. ఈ ఘటనతో ఆమె మెడపై గాయమైంది. గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను విచారించారు. చుట్టుపక్కల గాలించినా దుండగుడి ఆచూకీ లభ్యం కాలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు గుంతకల్లు వన్‌టౌన్ సీఐ మనోహర్ తెలిపారు.