హిందూపురం: సీజనల్, అంటువ్యాధుల నియంత్రణలో వంద శాతం పురోగతి సాధించినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజువాణి తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై పెనుకొండ డివిజన్‌లోని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ వైద్యులతో గురువారం ఆమె సమీక్షించారు. పీహెచ్‌సిలోని వైద్య సదుపాయలు, రోగులకు అందించిన సేవలు, పిల్లల ఆరోగ్య పరిస్థితి, రెగ్యులర్ హాస్టల్ విజిట్స్‌పై ఆరా తీశారు. ప్రమాదకరమైన వ్యాధులు, క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లయితే హయ్యర్ సెంటర్స్‌కు రెఫర్ చేయాలని సూచించారు.
ఆంధ్రా క్రికెట్ జట్టు ప్రాబబుల్స్‌కు ఆరుగురి ఎంపిక
అనంతపురం: ఆంధ్రా అండర్–23 క్రికెట్ జట్టు ప్రాబబుల్స్ ఎంపిక గురువారం ముగిసింది. అనంతపురానికి చెందిన ఆరుగురికి చోటు దక్కింది. వీరిలో మచ్చా కె.దత్తారెడ్డి, పి.అర్జున్ టెండూల్కర్, జి.మల్లికార్జున, ఎస్.మహమ్మద్ కమిల్, టి. హేంద్ర రెడ్డి, ఎం.దీపక్ ఉన్నారు. మచ్చా దత్తారెడ్డి కుడిచేతి ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా రాణిస్తున్నాడు. ఆంధ్ర అండర్ 23 రంజీ టోర్నీలో ప్రతిభ చాటాడు. అలాగే కుడిచేతి ఓపెనర్‌గా, ఆఫ్ స్పిన్నర్‌గా రాణిస్తున్న పి.అర్జున్ టెండూల్కర్ ఇప్పటికే ఆంధ్ర అండర్ 23, 19 జట్లలో ప్రాతినిథ్యం వహించారు. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన మల్లికార్జునకు అంతర జిల్లా మ్యాచ్‌ల్లో పది వికెట్లు తీసిన రికార్డు ఉంది. అలాగే ఎడమ చేతి మీడియ పేస్ బౌలర్ దీపక్ సైతం అంతర్ జిల్లా మ్యాచ్‌లో 11 వికెట్లు సాధించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కమిల్ ఎడమ చేతి స్పిన్నర్. ఎడమ చేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరుస్తున్నాడు. మహేంద్ర రెడ్డి కుడిచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. అండర్–19, అండర్–23 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, మరో అర్ధసెంచరీ సాధించాడు.
వ్యాధుల నియంత్రణలో పురోగతి
వ్యాధుల నియంత్రణలో పురోగతి
వ్యాధుల నియంత్రణలో పురోగతి
వ్యాధుల నియంత్రణలో పురోగతి
వ్యాధుల నియంత్రణలో పురోగతి
వ్యాధుల నియంత్రణలో పురోగతి