
పంచాయతీ బోరు.. పంటకు నీరు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక టీడీపీ నాయకుల అరాచకాలకు అంతేలేకుండా పోయింది. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో ‘తెలుగు తమ్ముళ్లు’ ప్రకృతి వనరులన్నీ దోచేస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా రామగిరి మండలం పేరూరు పంచాయతీ పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గ్రామంలో తాగునీటి అవసరాల కోసం వేసిన బోరునీటిని తన పొలానికి మళ్లించుకుంటూ దర్జాగా జొన్న, వరి, వేరుశనగ తదితర పంటలను సాగు చేసుకుంటున్నాడు. దీంతో బోరులో నీటిమట్టం తగ్గిపోగా తాగునీటి అవసరాలకు పి.కొత్తపల్లి వాసులంతా సమీపంలో ఉన్న పేరూరు గ్రామానికి వెళ్తున్నారు. ప్రజలు కి.మీ దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నా... ‘తెలుగు తమ్ముడు’ మాత్రం తనకేం పట్టనట్లు పంటకు నీరు పారించుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని పంచాయతీ బోరునీటిని గ్రామస్తులు తాగునీటి అవసరాలకే ఉపయోగపడేలా చూడాలని పి.కొత్తపల్లివాసులు కోరుతున్నారు.
పి.కొత్తపల్లిలో కొన్నినెలలుగా
‘తమ్ముడి’ దందా
తాగునీరులేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు