చిలమత్తూరు: వైఎస్ జగన్ హయాంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అద్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. హిందూపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉషశ్రీచరణ్, నియోజకవర్గ సమన్వయకర్త హాజరై మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు మాఫీ చేసి లక్షలాది మంది మహిళలకు మేలు చేకూర్చిన ఏకై క సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. ప్రతి కుటుంబంలోనూ మహిళకు ప్రాధాన్యత లభించేలా ఆనాడు చేసి చూపించారన్నారు. మహిళలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు రాజకీయ రంగంలోనూ మంత్రి పదవులు, 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 30 వేల మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో కనిపించకుండా పోయారని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారి గురించి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ మహిళలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూశారని వదిలేశారని మండిపడ్డారు. మహిళలకు మళ్లీ పాత రోజులు రావాలంటే, సంక్షేమం జరగాలంటే ఈ ముంచే కూటమి ప్రభుత్వం పోవాలని, ఆ దిశగా మహిళాశక్తి పోరాడాలని పిలుపునిచ్చారు.
హామీలు నెరవేర్చరా..?
ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అంటూ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణ పరిధి జిల్లా వరకు మాత్రమే అంటూ కొర్రీ వేయడం.. అది కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పకపోవడం మహిళలను నమ్మించి మోసం చేయడమేనన్నారు. మహిళల సంక్షేమం, భద్రత ఒక్క జగన్ హయాంలోనే ఉందని, నేడు మహిళలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మి, రాధమ్మ, సర్పంచ్‌లు లలితమ్మ, వైఎన్ భాగ్యమ్మ, కో ఆప్షన్ సభ్యురాలు కాంతమ్మ, సాహెరాబాను, కవితారెడ్డి, హరితారెడ్డి, సిద్దగంగమ్మ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
ఆడబిడ్డల మిస్సింగ్‌పై
నోరు మెదపని పవన్
కూటమి పాలనలో మహిళలకు
భద్రత కరువు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్ ధ్వజం