
21 మండలాల్లో వర్షం
ప్రశాంతి నిలయం: ముందస్తు ‘నైరుతి’ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ 21 మండలాల పరిధిలో 306.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా గోరంట్ల మండలంలో 48.2 మి.మీ వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా రొద్దం మండలంలో 1.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఇక నల్లచెరువు మండలంలో 45.2 మి.మీ, ఓబులదేవర చెరువు 44.2, కనగానపల్లి, ఎన్‌పీకుంట 24.2, సోమందేపల్లి 21.4, అమడగూరు 16.4, పెనుకొండ 14.0, కొత్తచెరువు 12.8, పుట్టపర్తి 10.6, గాండ్లపెంట 9.6, బత్తలపల్లి 8.2, తలుపుల 4.2, కదిరి 4.0, తనకల్లు 3.6, ధర్మవరం, బుక్కపట్నం మండలాల్లో 3.4 మి.మీ, రామగిరి 3.2, చిలమత్తూరు 2.8, చెన్నేకొత్తపల్లి మండలంలో 1.6 మి.మీ చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.