
మెగా సప్లిమెంటరీ ఫలితాలొచ్చేశాయ్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ మెగా సప్లిమెంటరీ (ఇయర్లీ వైజ్) ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఫలితాల కోసం జ్ఞానభూమి పోర్టల్‌లో చూడాలని సూచించారు. గతేడాది అక్టోబర్‌లో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 99 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, బీఏ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, రిజిస్ట్రార్ రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ, పీఆర్వో ప్రొఫెసర్ కే.రాంగోపాల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి. లోకేశ్వర్లు పాల్గొన్నారు.