
వారంతా నిరక్షరాస్యులు. అయితేనేం తమ పిల్లలను ఉన్నత చదువు
హరిపురం గ్రామ ముఖ చిత్రం
అమడగూరు: అదో కుగ్రామం. అక్కడ నివసిస్తున్న వారంతా వాల్మీకి సామాజికవర్గానికి చెందిన వారే. గతంలో ఒకే కుటుంబంలా ఉన్నవారు.. నేడు వంద కుటుంబాల వరకు విస్తరించారు. ఇందులో 90 ఇళ్లకు చెందినవారు గొర్రెలు మేపుకొంటూ జీవనం సాగిస్తుంటారు. అమడగూరు మండలంలో పుట్టగోసులపల్లిగా పిలిచే ఊరు కాల క్రమేణా హరిపురంగా రూపాంతరం చెందింది. అన్ని కుటుంబాల్లోనూ తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా తమ పిల్లలను కష్టపడి చదివించారు. ఇప్పుడు ఆ గ్రామంలో 15 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. మరో 35 మంది ప్రైవేట్ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా, మేనేజర్లుగా, సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకునే గ్రామంలో ఉన్న యువతీ యువకులంతా ఉద్యోగాల కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఇంటికో ఉద్యోగమే లక్ష్యం
గ్రామంలో 40 మంది యువకులతో పాటు 33 మంది యువతులు ఉండగా.. వారంతా డిగ్రీలు, పీజీలు పూర్తి చేశారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. విద్యావంతులుగా ఉన్న వారంతా తమ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలనే తపనతో అందరూ నూతన గృహాలను నిర్మించుకోవడంతో పాటు చందాల ద్వారా రూ.75 లక్షల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. జేకే పల్లి పంచాయతీలో మారుమూల గ్రామంగా ఉన్న హరిపురానికి గ్రామస్తులంతా కలసికట్టుగా ఉంటూ కందుకూరిపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న పొగాకుతోపు నుంచి తనకంటిపల్లి మీదుగా తారు రోడ్డు వేయించుకున్నారు. ఏదేమైనా భవిష్యత్తులో గ్రామంలోని ఇంటికో ఉద్యోగం ఉందన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు చర్చించు కొంటున్నారు.
వంద కుటుంబాల్లో
90 మంది గొర్రెల కాపరులే
నిరక్షరాస్యులైనా..
పిల్లలను చదివించుకున్నారు
50 మంది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కొలువులు

వారంతా నిరక్షరాస్యులు. అయితేనేం తమ పిల్లలను ఉన్నత చదువు