
కదిరి: ఈద్గా మైదానంలో
సామూహిక ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ ఆనందోత్సాహాలతో వివిధ ప్రాంతాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మసీదులు, దర్గాల్లో పోటెత్తిన జనంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మతపెద్దలు ఆధ్యాత్మిక ప్రసంగంలో రంజాన్ విశిష్టతను తెలియజేశారు. రంజాన్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

హిందూపురం: ఈద్ ముబారక్ చెప్పుకుంటున్న చిన్నారులు