
పెద్దమ్మతల్లికి ఆషాఢ అలంకరణ
ధర్మవరం రూరల్: పట్టణంలోని సాలే వీధిలో వెలసిన పెద్దమ్మతల్లి ఆషాఢ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకుడు వెంకటేష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని చీరలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
జిల్లాకు వర్ష సూచన
బుక్కరాయసముద్రం: రాగల ఐదు రోజులూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భారీ గాలులతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్‌బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

పెద్దమ్మతల్లికి ఆషాఢ అలంకరణ