సమష్టిగా కృషి చేద్దాం.. విజయం సాధిద్దాం | - | Sakshi
Sakshi News home page

సమష్టిగా కృషి చేద్దాం.. విజయం సాధిద్దాం

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు: ‘స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. వైఎస్సార్‌సీపీకి తొలి మెట్టులాగా భావించి గెలుపే లక్ష్యంగా సమష్టి కృషి చేద్దాం’ అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఆత్మకూరు పట్టణ, రూరల్‌, అనుమసముద్రంపేట మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు పేర్నాటి కోటేశ్వరరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కూనం సుధాకర్‌రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వెన్నుపోటు పొడిచిందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నగదు, ఇంకా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, చేనేతలు, రైతులకు జగనన్న అమలు చేసిన పథకాలను వివరించాలన్నారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ముందు పింఛన్లు ప్రకటించడం మోసపూరిత చర్య అన్న విషయాలను అన్ని వర్గాలకు వివరించాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఉందన్నారు. కార్యకర్తలు, స్థానిక నాయకులే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలను కైవశం చేసుకునేలా ఇప్పటి నుంచే కృషి చేద్దామని పేర్కొన్నారు. అనంతరం పార్టీ పదవులు పొందిన అందరికీ గుర్తింపుకార్డులను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఆదిశేషయ్య, పట్టణాధ్యక్షుడు నాగలపాటి ప్రతాప్‌రెడ్డి, డాక్టర్స్‌ విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ ప్రణీత్‌, మున్సిపల్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడు బి.రవికుమార్‌రెడ్డి, న్యాయవాదుల విభాగం అధ్యక్షుడు నందా ఓబులేసు, జెడ్పీటీసీలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ, మహిళా నాయకులు కల్పనారెడ్డి, పర్వీన్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పి.రమేష్‌రెడ్డి, ఎంపీపీ బోయిళ్ల పద్మజారెడ్డి, చెంచురెడ్డి, ఎన్‌ఆర్‌ఐ మీరా మొహిద్దీన్‌, ముజీబ్‌, రహీం, నందవరం ప్రసాద్‌, ప్రతాప్‌, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, కె.కిశోర్‌రెడ్డి, సానా వేణుగోపాల్‌రెడ్డి, గడ్డం శ్రీనివాసులురెడ్డి, మూడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement