ఆర్టీసీ కార్గో పాయింట్‌లో వానపాముల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్గో పాయింట్‌లో వానపాముల స్వాధీనం

Jul 29 2026 12:10 AM | Updated on Jul 29 2026 12:10 AM

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌ ఆవరణలోని కార్గో పాయింట్‌లో విజిలెన్స్‌ అధికారులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో సుమారు 35 కిలోల వానపాములను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. విచారణలో అవి అనంతసాగరం మండలంలోని ఓ ఎరువుల తయారీ సంస్థకు చెందినవిగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే నిబంధనల ప్రకారం అనుమతులతోనే వాటిని రవాణా చేశారా?, లేదా అనే అంశంపై డీఎఫ్‌ఓ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడి కానున్నాయి. సదరు పార్శిల్స్‌ విజయవాడ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో ఆర్టీసీ విజిలెన్స్‌ అధికారులు జి.వెంకటేశ్వర్లు, పీవీ ప్రసాద్‌, కేఎన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement