నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఏఐసీటీఈ ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్‌ను శుక్రవారం తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లారుతూ ఐడియా ల్యాబ్‌లో సీఎస్సీ మెషీన్ కటింగ్, త్రీడీ ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, ఐఓటీ ల్యాబ్‌లతో విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేటివ్ టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. యువ ఇంజినీర్లు స్టార్టప్‌లను, ఇంకుబేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐడియా ల్యాబ్ కో ఆర్డినేటర్ రత్నకమల మాట్లాడుతూ సాంకేతిక పరమైన ఐడియాల ట్రాన్స్‌ఫర్మేషన్, ఇన్నోవేషన్, ఇంప్లిమెంటేషన్, స్టార్టప్స్ అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవచ్చని తెలిపారు. కళాశాల చైర్మన్ అశోకరాజు మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు అధునాతన సాంకేతిక విజ్ఞనానికి ఐడియాని, టెక్నాలజీని జోడించి అభివృద్ధి పరచడానికి ఐడియా ల్యాబ్ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ రమేష్ కుముద్, జనార్దన్‌రాజు, కో కోఆర్డినేటర్ సునీల్‌కుమార్‌రెడ్డి, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


