పేద కుటుంబానికి రూ.లక్ష సాయం | - | Sakshi
Sakshi News home page

పేద కుటుంబానికి రూ.లక్ష సాయం

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల కేంద్రంలోని యర్రబల్లిపాళేనికి చెందిన మూలే జనార్ధన్‌రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇంటర్‌, ఎనిమిదో తరగతి కుమార్తెల చదువు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారి పరిస్థితి గురించి వింజమూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత కర్నాటి ప్రభాకర్‌రెడ్డి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వారికి భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు. తన వంతుగా రూ.లక్ష నగదును బ్యాంక్‌ ద్వారా మృతుడి భార్య జ్యోతి అకౌంట్‌లో జమ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళవారం మృతుడి భార్యాబిడ్డలు కలిసిన నేపథ్యంలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పిల్లల చదువులకు సంబంధించి భవిష్యత్‌లో కూడా తన వంతు సాయం కొనసాగుతుందన్నారు. కష్టకాలంలో పేద కుటుంబానికి అండగా నిలిచిన మేకపాటికి బాధిత కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement