2026 పొగాకు వేలం ప్రక్రియ గురువారం ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ప్రారంభం కానుంది. వేలానికి రైతులు, కంపెనీల ప్రతినిధులు, అధికారులు పూర్తి సహకారం అందించి సజావుగా సాగేలా సహకరించాలి.– జి.సునీల్‌కుమార్,
వేలం నిర్వహణాధికారి,
డీసీపల్లి పొగాకు బోర్డు
సూచనలు పాటించాలి
ఈ ఏడాది పొగాకు పంట దిగుబడులు ఆశాజనంగా ఉన్నాయి. వేలంలో మంచి ధరలు లభించే అవకాశాలున్నాయి. రైతులు అవశేషాల్లేని, హీట్ లేకుండా గ్రేడ్‌ల ఆధారంగా బేళ్లను తయారు చేసుకోవాలి. పొగాకు బోర్డు అధికారుల సూచనలు పాటిస్తే మంచి ధరలు లభించే అవకాశం ఉంది.
– జి.రాజశేఖర్, వేలం నిర్వహణాధికారి, కలిగిరి పొగాకు బోర్డు


